హోర్ముజ్ జలసంధిలో 27 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న పనామా జెండా చమురు నౌక ఎంటీ లూయీపై లింపెట్ మైన్లతో దాడి జరిగినట్లు కథనం పేర్కొంది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో చిన్న పడవలో వచ్చిన దుండగులు నౌకకు చేరుకుని అడుగు భాగంలో రెండు లింపెట్ మైన్లను అమర్చినట్లు సమాచారం.
మైన్లు పేలడంతో నౌక ఇంజిన్ గదిలో మంటలు చెలరేగి కొద్దిసేపు ప్రయాణం నిలిచిపోయింది. అయితే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, సముద్రంలో చమురు లీకేజీ కూడా జరగలేదని అధికారులు తెలిపారు. అనంతరం నౌక తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు పేర్కొన్నారు.
ఒమన్‌లోని ఖసబ్కు ఈశాన్యంగా సుమారు 46 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగినట్లు బ్రిటన్ సముద్ర వాణిజ్య కార్యకలాపాల సంస్థ వెల్లడించినట్లు కథనం తెలిపింది. లింపెట్ మైన్లను నౌకల అడుగు భాగానికి అమర్చి దాడులు చేసే పద్ధతి గతంలో కూడా ఈ ప్రాంతంలో కనిపించినట్లు పేర్కొన్నారు.
ఇదే ప్రాంతంలో అంతకుముందు ఎమ్టీ అర్జనా అనే మరో చమురు నౌకపైనా దాడి జరిగినట్లు సమాచారం. ఆ నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులు కూడా క్షేమంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించినట్లు కథనం పేర్కొంది. భారతీయ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హోర్ముజ్‌లో 27 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి.. అందరూ సురక్షితం
11
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk