కువైట్‌లో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ కె. కాంతి కిరణ్ స్వదేశానికి తిరిగి చేరేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, APNRTS సమన్వయంతో వేగవంతమైన చర్యలు చేపట్టాయి. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి మరో ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది.
కాంతి కిరణ్ స్వదేశానికి చేరేందుకు సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించగా, గౌరవ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు APNRTS అధ్యక్షులు డాక్టర్ వేమూరు రవికుమార్ వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలను ప్రారంభించారు.
ఈ ప్రక్రియలో APNRTS డైరెక్టర్ (ఆపరేషన్స్ & సర్వీసెస్) అక్కిలి నాగేంద్ర బాబు కాంతి కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, ప్రయాణానికి అవసరమైన పత్రాలు, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియలను వేగంగా పూర్తి చేయించారు.
అన్ని అనుమతులు పూర్తికావడంతో కాంతి కిరణ్ సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో APNRTS, భారత రాయబార కార్యాలయం, కుటుంబ సభ్యుల సమిష్టి సహకారం కీలక పాత్ర పోషించింది.
విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాసాంధ్రులకు అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి APNRTS నిరంతరం కృషి చేస్తోంది. అవసరమైనప్పుడు న్యాయ, పరిపాలనా, రాయబార సహాయాన్ని అందిస్తూ స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడంలో కీలక బాధ్యతను నిర్వర్తిస్తోంది. కాంతి కిరణ్ విజయవంతంగా స్వదేశానికి చేరుకోవడం ద్వారా మరోసారి APNRTS సేవా నిబద్ధత స్పష్టమైంది.
కువైట్ నుంచి ప్రవాసాంధ్రుడిని స్వదేశానికి చేర్చిన APNRTS
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan