నాలు లేదా ఒత్తిడి పెంచకూడదని సూచించాడు.
వైభవ్ సహజమైన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడని జయసూర్య పేర్కొన్నాడు. ఇలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడి ఆటతీరులో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా, తన పద్ధతిలో ఎదిగే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఇంకా అతడికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ, సరైన మద్దతు లభిస్తే భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా మారతాడని చెప్పాడు.
భారత జట్టులోని అభిషేక్ శర్మను కూడా జయసూర్య ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడు ఆల్‌రౌండ్ బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాడని, మైదానంలోని అన్ని వైపులా షాట్లు ఆడగలగడం అతడి ప్రధాన బలం అని వివరించాడు.
డిసెంబర్లో భారత్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టు సన్నద్ధతపై కూడా జయసూర్య సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపాడు. భారత్‌లో కూడా ఇదే స్థాయి ఆటను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
13