ustaad bhagat singh trailer out fans cheer pawan kalyans mass avatar

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ రిలీజ్.. పవన్ స్వాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా

5

Published on: 📅 14 Mar 2026, 07:06 PM
Reporter: 🖊 Ramesh Kumar

పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. పవన్ స్వాగ్, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 15న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు మరింత పెరిగాయి.

Sponsored