పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా, రష్యా అధ్యక్షులు ఫోన్‌లో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు తరలించాలని పుతిన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. యురేనియం భద్రతపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇలాంటి ప్రతిపాదనను ఇరాన్ అంగీకరించే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ యురేనియం నిల్వలపై కొత్త చర్చ.. పుతిన్ ప్రతిపాదనకు ట్రంప్ నిరాకరణ
6
Published: 📅
Reported by: 🖊
Ramesh Kumar