అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ప్రకటించిన ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన తీవ్రంగా గాయపడి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఈ విషయంపై అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ నుంచి ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిస్థితిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్రంగా గాయపడ్డారా?.. అమెరికా సంచలన వ్యాఖ్యలు
7
Published on: 📅 13 Mar 2026, 06:56 PM
Reporter: 🖊 Ramesh Kumar