తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం 2676 పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారినీ అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పలు కేంద్రాల్లో విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఆల్ ద బెస్ట్ సందేశాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. 5.28 లక్షల మంది హాజరు
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 తెలంగాణ