సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా వాయుసేనకు చెందిన ఐదు KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నట్టు సమాచారం. అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, ప్రస్తుతం మరమ్మత్తులు కొనసాగుతున్నాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందించలేదు. ఇదే సమయంలో ఇరాక్‌లో మరో KC-135 కుప్పకూలి ఆరుగురు సిబ్బంది మృతి చెందిన ఘటన అమెరికా వైమానిక దళంపై మరింత ఒత్తిడి పెంచింది.
ఇరాన్ దాడుల్లో అమెరికా వాయుసేనకు నష్టం.. ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నట్టు సమాచారం
2
Published on: 📅 14 Mar 2026, 11:05 AM
Reporter: 🖊 Suresh Reddy