T20 వరల్డ్‌కప్ 2026లో గ్రూప్–A ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు శనివారం కొలంబోలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బౌలింగ్‌ను ఎంచుకున్నారు. అయితే మ్యాచ్‌పై కొలంబో వాతావరణం ప్రభావం చూపే అవకాశముంది. భారీ వర్ష సూచనలతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ వివాదం మధ్య పాకిస్థాన్‌కు ఇది కీలక పోరు. సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించాలంటే మిగతా మూడు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
T20 వరల్డ్‌కప్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్, వర్షమే ప్రధాన ఆందోళన
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan