lokesh responds to allegations on vijaya ghee quality

విజయ నెయ్యిపై ఆరోపణలు… లోకేశ్ స్పందన

2

Published on: 📅 11 Mar 2026, 05:11 PM
Reporter: 🖊 Suresh Reddy

ఏపీ ‘విజయ’ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మార్కెట్ నుంచి రాండమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వద్ద ఉన్న CALF, NDDB టెస్ట్ రిపోర్ట్స్‌ను కూడా పరిశీలిస్తామని చెప్పారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కాగా మేఘనా ఫుడ్స్‌కు విజయ (ఏపీ) ఫ్రాంచైజీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Sponsored