సీఎం చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం కరోనా సమయంలో కూడా తక్కువగానే అప్పులు చేసిందని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో కనీస నిల్వ కూడా లేదని, చంద్రబాబు బిల్డప్ మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కూడా అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రెస్ మీట్‌లో జగన్ తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబుపై జగన్ అప్పుల ఆరోపణలు
10
Published: 📅
Reported by: 🖊
Ramesh Kumar