మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఒక జీబీ డేటాపై రూ.1 ట్యాక్స్ విధించినా ఏటా సుమారు రూ.22,900 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.