బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వెస్టిండీస్ స్పిన్నర్‌గా నిలిచాడు.
గతంలో రకీమ్ కార్న్‌వాల్ 5 వికెట్లకు 74 పరుగులు ఇచ్చి ఈ రికార్డు సాధించగా, వారికన్ ఇప్పుడు దాన్ని అధిగమించాడు. బంగ్లాదేశ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కరేబియన్ స్పిన్నర్లలో దేవేంద్ర బిషూ కూడా ఉన్నాడు. వారికన్‌కు 26 టెస్టుల్లో ఇది నాలుగో ఫైఫర్ కావడం విశేషం.
వారికన్ ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షద్మాన్ ఇస్లాం 105 పరుగులతో సెంచరీ సాధించి జట్టుకు అండగా నిలిచాడు. తౌహిద్ హృదోయ్ 42 పరుగులు చేయగా, లిటన్ దాస్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ బౌలర్లలో వారికన్తో పాటు బిషప్, షమార్ జోసఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. జేడన్ సీల్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట నిలిచే సమయానికి ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 15 పరుగులకు ఔటవగా, జాన్ క్యాంప్‌బెల్ 53, తేజ్‌నరైన్ చంద్రపాల్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
బంగ్లాదేశ్ గడ్డపై జోమెల్ వారికన్ రికార్డు.. 5 వికెట్లతో చరిత్ర
17