gulf nations warn iran over attacks

ఇరాన్‌పై గల్ఫ్ దేశాల హెచ్చరిక

5

Published on: 📅 09 Mar 2026, 02:48 PM
Reporter: 🖊 Suresh Reddy

తమపై దాడులు కొనసాగిస్తున్న ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అరబ్ దేశాలపై దాడులు ఆపకపోతే టెహ్రాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుందని సౌదీ అరేబియా హెచ్చరించింది. ఈ చర్యలు భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద షైబా ఆయిల్ ఫీల్డ్‌పై జరిగిన దాడిని సౌదీ ఖండించింది. మరోవైపు దాడులు చేయడం లేదని చెప్పుకుంటూ డ్రోన్లతో విరుచుకుపడుతోందని ఖతర్ ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sponsored