ఖమ్మంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భర్త పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించిన భార్య డబ్బుకోసం హత్యకు పన్నాగం పన్నింది. కొన్ని నెలలైనా భర్త మరణించకపోవడంతో అతడిని చంపాలని నిర్ణయించుకుంది. భర్త రవికి మద్యం తాగించి మరో నలుగురితో కలిసి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య ప్రశాంతి సహా ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.