నేపాల్‌లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సాగుతున్న Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపిస్తున్నారు. 36 ఏళ్ల ఈ యువ నేత స్ట్రక్చరల్ ఇంజినీర్ మాత్రమే కాకుండా ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా మద్దతు లభించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఆయన పార్టీ RSP విజయం సాధిస్తే బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
నేపాల్ రాజకీయాల్లో Gen-Z నాయకుడు బాలెన్ షా
7
Published: 📅
Reported by: 🖊
Suresh Reddy