కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం అమలులో ఉందని చెప్పారు. ఫిన్‌ల్యాండ్, యూకే కూడా ఇదే తరహా నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్: కర్ణాటక
9
Published: 📅
Reported by: 🖊
Ramesh Kumar