అస్సాంలో నిన్న సుఖోయ్ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. విమానంలో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని ఐఏఎఫ్ భరోసా ఇచ్చింది. సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం విమానం గాల్లోకి ఎగిరింది. అయితే రాత్రి 7.42 గంటలకు రాడార్‌తో ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
అస్సాంలో సుఖోయ్ యుద్ధవిమానం క్రాష్… ఇద్దరు పైలట్లు మృతి
5
Published on: 📅 25 Apr 2026, 03:19 PM
Reported by: 🖊
Ramesh Kumar