టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ వివాహబంధంలో అడుగుపెట్టారు. మార్చి 6న నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతిథుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు కొత్తజంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.