వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.60, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంపు చేసింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.905 నుంచి రూ.965కు చేరింది. అలాగే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,961 నుంచి రూ.2,076కు పెరిగింది. ధరల పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.