కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 14వ వర్ధంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రజానాయకుడిగా ఎర్రన్నాయుడిని ఆయన స్మరించారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై జీవితాంతం పార్టీ కోసం పనిచేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి ఆప్తుడిగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకుడని కొనియాడారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎర్రన్నాయుడు నిరంతరం కృషి చేశారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బలంగా గళం వినిపించారని, పదవుల కంటే ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా గుర్తింపు పొందారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
ఎర్రన్నాయుడు తనకు అన్నయ్య మాత్రమే కాకుండా రాజకీయ గురువు, మార్గదర్శి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఆయన వేసిన పునాది ఎంతో ముఖ్యమని చెప్పారు. భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు, ఆశయాలు సజీవంగానే ఉన్నాయని తెలిపారు. ఎర్రన్నాయుడు చూపిన మార్గంలోనే తాను కొనసాగుతానని, ప్రజాసేవనే తన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
8
Published: 📅
Reported by: 🖊
Sarika Sk