ఆంధ్రప్రదేశ్‌కు మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వ్యవస్థ తీవ్ర తుఫానుగా బలపడినట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని పేర్కొంది.
అంచనాల ప్రకారం, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని అధికారులు హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది.
అలాగే ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాల అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమతో పాటు నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది.
ముందస్తు సహాయక చర్యల కోసం ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక
13
Published: 📅
Reported by: 🖊
Kanakadri