unseasonal rains likely in telangana

తెలంగాణలో అకాల వర్షాల సూచన

2

Published on: 📅 10 Mar 2026, 03:56 PM
Reporter: 🖊 Ramesh Kumar

తెలంగాణలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపారు. మరోవైపు ఈ నెల 15 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Sponsored