రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్, వైన్ బ్రాండ్ల ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల వాటి అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించే ప్రతిపాదన సిద్ధం చేసింది. క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాత ఒక్కో సీసాపై రూ.3,000 వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉండటంతో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.