తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వేలాది కోళ్లు మృతి చెందాయన్న సమాచారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లు తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లో ఉన్న కోళ్ల ఫారాలపై కఠిన నిఘా పెట్టాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. మృతి చెందిన కోళ్లను వెంటనే పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది.