హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోలో గిరిజన కళాకారుల వెదురు కళాకృతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వెదురుతో తయారు చేసిన ప్రత్యేక చేతి వ్యాయామ కర్రలను ప్రదర్శనలో ఉంచారు. ఫ్లూట్‌లా కనిపించే ఈ కర్రలను చేతితో తిప్పితే ఈల శబ్దం వినిపించడం ప్రత్యేకత. ఇందుకోసం వెదురు కర్ర కణుపుల దగ్గర రంధ్రాలు చేసి ఒక చివర మెటల్ రింగ్ అమర్చారు. ఈ వినూత్న కళాఖండాలు ఎక్స్‌పోకు వచ్చిన సందర్శకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోలో ఆకట్టుకుంటున్న గిరిజన వెదురు వ్యాయామ కర్రలు
4
Published on: 📅 13 Mar 2026, 10:13 AM
Reporter: 🖊 Kiran Rao