హైదరాబాద్ కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రపంచంలోని మూడు అతిపెద్ద డాల్బీ సినిమాస్‌లో ఇదొకటని తెలిపారు. ఇలాంటి థియేటర్ నిర్మాణం చాలా సంవత్సరాల కృషి ఫలితమని అన్నారు. తన సినీ ప్రయాణానికి ప్రేరణగా నిలిచిన తండ్రి అల్లు రామలింగయ్య, చిరంజీవి, ఏషియన్ ఫిల్మ్స్ నారాయణదాస్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. సీఎం రేవంత్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు
7