న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భువీ ప్రతిభ, అనుభవంపై తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేస్తూనే, అతడిని ఈ సమయంలో తిరిగి జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్‌కు ఇంకా చాలాసమయం ఉన్నప్పుడు 36 ఏళ్ల భువనేశ్వర్‌ను ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను యువ ఫాస్ట్ బౌలర్లను పరీక్షించడానికి ఉపయోగించి ఉంటే భారత జట్టుకు భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనం కలిగేదని అన్నాడు.
మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ పేసర్లకు అన్ని మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వాల్సిందని సూచించాడు. న్యూజిలాండ్ వంటి దేశంలో బౌలింగ్ చేయడం ద్వారా పేసర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన అనుభవం సంపాదించగలరని పేర్కొన్నాడు.
భువనేశ్వర్ ఒక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చాడనే కారణంతో తాను విమర్శించడం లేదని కూడా ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. తొలి రెండు ఓవర్లలో అతడు బాగా బౌలింగ్ చేశాడని, కొన్ని సందర్భాల్లో ఏ బౌలర్‌కైనా పరుగులు వెళ్లొచ్చని అన్నాడు.
అసలు సమస్య భువీ సామర్థ్యం కాదని, ఎంపిక సమయమేనని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. యువ బౌలర్లను అభివృద్ధి చేయాలంటే కఠిన పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వాల్సిందేనని సూచించాడు.
కివీస్ సిరీస్‌కు భువీ ఎంపికే తప్పు.. యువ పేసర్లకు అవకాశం ఇవ్వాల్సింది: ఇర్ఫాన్ పఠాన్
10