pm modi says india will become ai powerhouse budget 2026 support

AI శక్తిగా భారత్‌ అవతరిస్తుంది: యువతపై ప్రధాని మోదీ విశ్వాసం

4

Published on: 📅 31 Mar 2026, 06:34 AM
Reporter: 🖊

భారత్‌ కేవలం AI వినియోగదారుడిగా కాకుండా సృష్టికర్తగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ యువతలో ఉన్న ప్రతిభ, స్టార్టప్‌ల ఉత్సాహం భారత్‌ను AI శక్తిగా నిలబెడుతుందని అన్నారు. తయారీ, పాలన, ఉపాధి రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. బడ్జెట్ 2026-27లో డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, సెమీకండక్టర్ తయారీకి ప్రోత్సాహం ఇచ్చినట్లు వివరించారు. ఇండియాAI ఫ్రేమ్‌వర్క్ ద్వారా యువ పరిశోధకులకు ఆధునిక కంప్యూటింగ్ సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం దేశ దిశను సూచిస్తోందన్నారు.

Sponsored