డీప్‌ఫేక్స్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, దీనిపై మరింత కఠిన నియంత్రణలు అవసరమని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వయస్సు ఆధారిత పరిమితులు, ఆన్‌లైన్ భద్రత అంశాలపై సోషల్ మీడియా సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, మెటా, ఎక్స్ వంటి సంస్థలు భారత చట్టాలు, రాజ్యాంగాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పిల్లలను డిజిటల్ హానుల నుంచి రక్షించేందుకు వయస్సు ధృవీకరణ వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై విస్తృత సమ్మతి తీసుకువచ్చి బలమైన చట్టాలు రూపొందిస్తామని వెల్లడించారు.
డీప్‌ఫేక్స్‌పై కఠిన చట్టాలు అవసరం: సోషల్ మీడియాతో చర్చల్లో కేంద్రం
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan