నటుడు అల్లు శిరీష్ తన కుటుంబంలో తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనికతో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని తాను కోరుకున్నానని తెలిపారు. నయనికకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని, ఏ విషయం నచ్చకపోతే ముక్కుసూటిగా చెబుతుందని అన్నారు. ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా తన పనిని బాగా అర్థం చేసుకుంటుందని శిరీష్ పేర్కొన్నారు.
నా పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి.. అల్లు శిరీష్
4
Published on: 📅 13 Mar 2026, 03:19 PM
Reporter: 🖊 Anitha Sharma