బంగ్లాదేశ్-పాకిస్థాన్ రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ ఘటన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ స్పందించాడు. రూల్స్ ప్రకారం అది సరైన రనౌటేనని స్పష్టం చేశాడు. ఇది ఛారిటీ మ్యాచ్ కాదని, అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ప్రతి అవకాశం కోసం పోటీ పడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ ఘటనపై బయట వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆటగాళ్లుగా తమకు అది ఔటేనని అనిపించిందని లిటన్ దాస్ వెల్లడించాడు.
‘ఇది ఛారిటీ మ్యాచ్ కాదు’.. రనౌట్ వివాదంపై లిటన్ దాస్ స్పందన
6
Published: 📅
Reported by: 🖊
Suresh Reddy