అమెరికా–ఇజ్రాయెల్‌తో యుద్ధ పరిస్థితుల మధ్య గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు తెలిపారు. ఇతర దేశాలను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పొరుగు దేశాలు తమపై దాడి చేయనంతవరకు వాటిపై దాడులు చేయొద్దని తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.