లీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. Godzilla vs. Kong చిత్రంలో 'జియా' పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యువ నటి కేలీ హాటిల్ (Kaylee Hottle) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె అకాల మరణం సినీ అభిమానులను, హాలీవుడ్ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఇజామ్స్‌విల్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 1995 హోండా అకార్డ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి రహదారి పక్కనున్న కల్వర్ట్‌ను ఢీకొట్టింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, కేలీ హాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, మరో ప్రయాణికుడు చికిత్సను నిరాకరించినట్లు వెల్లడించారు.
కేలీ హాటిల్ జన్మతః చెవిటి. ఆమె కుటుంబ సభ్యుల్లో కూడా పలువురు వినికిడి లోపంతో జీవిస్తున్నారు. ఆమె తండ్రి జోషువా హాటిల్ తన కుమార్తె మరణ వార్తను అమెరికన్ సైన్ లాంగ్వేజ్ (ASL) ద్వారా ఫేస్‌బుక్ లైవ్‌లో భావోద్వేగంగా వెల్లడించారు. తన కుమార్తెతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుందని ఆయన తెలిపారు. ప్రమాద సమయంలో కారు నడిపిన యువకుడిని క్షమిస్తున్నానని, ఈ ఘటనతో అతని జీవితం నాశనం కాకూడదని కూడా పేర్కొన్నారు.
కేలీ హాటిల్ 2021లో విడుదలైన Godzilla vs. Kong చిత్రంలో 'జియా' పాత్ర ద్వారా సినీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సంకేత భాష ద్వారా కాంగ్‌తో భావోద్వేగ అనుబంధాన్ని చూపించిన ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం Godzilla x Kong: The New Empire చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. Magnum P.I. టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించిన ఆమె, త్వరలో విడుదల కానున్న What Doesn't Kill Us చిత్రంలో కూడా కనిపించనున్నారు.
హాలీవుడ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల నటి కేలీ హాటిల్ మృతి
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan