ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్-2’ ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈసారి సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుందని తెలిపింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.