dhurandhar sets record on bookmyshow

బుక్ మై షోలో ‘ధురంధర్’ కొత్త రికార్డు

1

Published on: 📅 31 Mar 2026, 06:56 AM
Reporter: 🖊

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు విక్రయమైన చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీకి ఇప్పటివరకు 1.3 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా (1.25 కోట్లు), జవాన్ (1.24 కోట్లు), స్త్రీ 2 (1.11 కోట్లు) ఉన్నాయి.

Sponsored