సూపర్ సిక్స్ పథకాలను 20 నెలల్లో సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలూ సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా చిన్న తప్పు లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవతో పాటు 2.50 లక్షల గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అవకాశాలు ఎన్నో ఉన్నాయని, నిర్లక్ష్యం ఉంటే ముందుకు వెళ్లలేమన్నారు.