border 2 ott release date announced on netflix

ఓటీటీకి వస్తున్న ‘బోర్డర్ 2’.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్

5

Published on: 📅 13 Mar 2026, 11:36 AM
Reporter: 🖊 Suresh Reddy

సన్నీ దేఓల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన దేశభక్తి చిత్రం ‘బోర్డర్ 2’ త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 1997లో సంచలనం సృష్టించిన ‘బోర్డర్’ సినిమాకు ఇది సీక్వెల్. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యుద్ధ నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానులు ఇప్పుడు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sponsored