ఏలూరు పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కైండ్‌నెస్ వాల్ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించారు. ఏలూరు పోలీస్ స్కూల్ సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ అల్మారాలో మనకు అవసరం లేని వస్తువులు ఉంచి.. అప్పటికే ఉన్న వస్తువులలో మనకు కావాల్సినవి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏలూరు పోలీసులు ఈ కార్యక్రమం ప్రారంభించారు. పోలీసుల తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఏమైనా పెట్టొచ్చు.. ఏదైనా పట్టుకెళ్లొచ్చు.. ఇక్కడంతా ఫ్రీనే..
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్