తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ (Vijay) ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం, ముఖ్యంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న టాస్మాక్ షాపులను మూసివేయాలని తీసుకున్నది. ఈ చర్య విద్యార్థుల భద్రతకు ఎంతో అవసరమైందని, వారి ప్రయాణాల్లో మద్యం షాపులతో సంబంధం లేకుండా వారిని సాధ్యమైనంత దూరంగా ఉంచడం ఎంతో మంచిదని భావిస్తున్నారు.
ఈ నిర్ణయం గురించి తాము ఎంతో అభినందిస్తున్నట్లు నటుడు విశాల్ తన ట్వీట్‌లో తెలిపారు. "మీకు అభినందనలు, విజిల్స్ టూయా" అంటూ, ఆయన ప్రత్యేక శైలిలో విజయ్‌కు ప్రశంసలు తెలియజేశారు. విశాల్ ప్రకారం, "717 మద్యం దుకాణాలను మూసివేయాలన్న మీ నిర్ణయం అద్భుతం. ప్రతిరోజూ విద్యార్థులు ఆ షాపుల పక్కన నుండి వెళ్లిపోతారు, వారు వారి గమ్యస్థానానికి చేరుకునేటప్పుడు వీటి వల్ల వారు వేధింపులకు గురవుతారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ" అని అన్నారు.
విశాల్, తన స్నేహితుడైన విజయ్‌కు తన మద్దతు తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థుల భద్రతను నిర్ధారించడంలో కీలకమై, సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురాగలదు. "మీకు, మీ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాను" అంటూ విశాల్ తన అభినందనలు వ్యక్తం చేశారు.
విజయ్‌కు విజిల్ వేసి అభినందనలు చెప్పిన విశాల్
2
Published: 📅
Reported by: 🖊
Banu Prakash