తాజా ఏపీ గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దంపతులు విశేషంగా రాణించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి కఠినంగా సిద్ధమయ్యారు. వారి కృషికి ఫలితం దక్కింది. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగాలు రావడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు రాజీనామా… గ్రూప్-2లో తాడిపత్రి దంపతుల డబుల్ విజయం
1
Published on: 📅 31 Mar 2026, 10:48 AM
Reporter: 🖊