పార్లమెంట్ ఇరుసభలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (సవరణ) బిల్లు–2026ను గురువారం ఆమోదించాయి. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మండవియా రాజ్యసభలో మాట్లాడుతూ పాత చట్టాల రద్దుపై స్పష్టత కల్పించేందుకే ఈ సవరణ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. లోక్‌సభలో అయితే విపక్ష నిరసనలతో సభ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బడ్జెట్ సమావేశాల తొలి విడత రేపటితో ముగియనుంది
పార్లమెంట్‌లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ సవరణ బిల్లు ఆమోదం
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan