భారత బ్యాంకింగ్ వ్యవస్థపై మూడీస్ రేటింగ్స్ తన స్టేబుల్ ఔట్‌లుక్‌ను కొనసాగించింది. బలమైన ఆర్థిక వృద్ధి, స్థిరమైన ఆస్తుల నాణ్యత, పటిష్టమైన మూలధన బఫర్లు బ్యాంకులకు ఎదురయ్యే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సహాయపడతాయని పేర్కొంది. రాబోయే 12–18 నెలల పాటు బ్యాంకులకు అనుకూల వాతావరణం కొనసాగుతుందని మూడీస్ అంచనా వేసింది. FY27లో భారతదేశం 6.4% వాస్తవ GDP వృద్ధి నమోదు చేస్తుందని, ఇది G-20 దేశాల్లో అత్యధికమని తెలిపింది. ఇది క్రెడిట్ గ్రోత్‌కు బలమైన మద్దతు ఇస్తుందని పేర్కొంది.
భారత బ్యాంకింగ్ వ్యవస్థపై మూడీస్ స్టేబుల్ ఔట్‌లుక్ కొనసాగింపు
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan