దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940గా నమోదైంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,31,940గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,950గా ఉంది.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతిలో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,43,940, 22 క్యారెట్లు రూ.1,31,940, 18 క్యారెట్లు రూ.1,07,950గా ఉన్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,090గా, 22 క్యారెట్లు రూ.1,32,090గా నమోదైంది. వడోదరాలో 24 క్యారెట్ల ధర రూ.1,43,990గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,14,900కు చేరింది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కరెన్సీ మార్పిడి, స్థానిక డిమాండ్ తదితర అంశాల ప్రభావంతో తరచూ మారుతుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు.
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్లు రూ.1.43 లక్షలు
16
Published: 📅
Reported by: 🖊
Sarika Sk