కార్పొరేట్ ఉద్యోగులకు సాధారణ శిక్షణకు భిన్నంగా ప్రకృతిని ఆధారంగా చేసుకుని పాఠాలు చెబుతున్నారు సాయి కిరణ్ భాగవతుల. 13 ఏళ్ల కార్పొరేట్ జీవితాన్ని వదిలిన ఆయన, మూడేళ్ల క్రితం ‘వైల్డ్‌లైఫ్ విస్పరర్స్’ పేరుతో సంస్థ ప్రారంభించారు. ఉద్యోగులను అడవుల్లోకి తీసుకెళ్లి జంతువుల ప్రవర్తన ద్వారా టీమ్ బిల్డింగ్, నాయకత్వం, కమ్యూనికేషన్, పరిశీలనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.
పెర్ఫెట్టి వాన్ మెల్లెకు చెందిన 15 మంది మేనేజర్లను జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కు తీసుకెళ్లి నాలుగు రోజుల టీమ్ బాండింగ్ శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మరో కార్పొరేట్ బృందానికి తడోబా అడవుల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ నిర్వహించారు. ఇప్పటివరకు ఎనిమిది కంపెనీలు, రెండు విశ్వవిద్యాలయాలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
చీమల సమన్వయం, సింహాల జట్టు కృషి, తేనెటీగలు ప్రమాదాలకు స్పందించే తీరు, పక్షుల కమ్యూనికేషన్ వంటి అంశాలను కార్పొరేట్ పరిస్థితులతో అనుసంధానించి బోధిస్తున్నట్లు సాయి కిరణ్ వివరించారు. అడవిని ప్రత్యక్షంగా అనుభవించినప్పుడే ప్రకృతి నుంచి పాఠాలు బలంగా అర్థమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా జంతువుల ప్రవర్తనను సంవత్సరాలుగా పరిశీలించిన అనుభవమే ఈ ఆలోచనకు పునాదిగా మారిందని తెలిపారు. దేశీయ అడవులతో పాటు ఆఫ్రికా, శ్రీలంక, అమెజాన్ వంటి ప్రాంతాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనేది తమ ప్రణాళిక అని చెప్పారు.
అడవిలో కార్పొరేట్ పాఠాలు.. ప్రకృతినే గురువుగా మార్చిన సాయి కిరణ్
16
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk