శ్రీశైల మహాక్షేత్రం టోల్ గేట్ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. బ్రేక్ ఫెయిలైన వాహనం కూడలి వద్ద ఉన్న కొందరు కన్నడ భక్తులను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ప్రమాదం వెంటనే అక్కడి వారు స్పందించి గాయపడిన వారిని దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీశైలంలో ప్రమాదం.. టోల్ గేట్ వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన బొలెరో
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan