ఓ మహిళ ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ అనుకోని అగ్నిప్రమాద సమయంలో ధైర్యంగా స్పందించి ఆమెకు సహాయం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
శివాంగి జోషి ఇంటి వంటగదిలో స్టవ్‌పై ఉన్న పెనం నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. పరిస్థితిని ఎలా అదుపు చేయాలో అర్థం కాక ఆమె భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ మంటలను గమనించి వెంటనే ఇంట్లోకి వెళ్లి సహాయం చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను శివాంగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అత్యవసర సమయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా స్పందించిన అతడి సమయస్ఫూర్తిని ఆమె ప్రశంసించారు. తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవని పేర్కొన్నారు.
మనుషులను వారి రూపం, వృత్తి లేదా పనిని బట్టి అంచనా వేయకూడదని, ప్రతి ఒక్కరిలో ధైర్యం, కరుణ, మానవత్వం ఉంటాయని శివాంగి అభిప్రాయపడ్డారు. వీడియోపై స్పందించిన నెటిజన్లు కూడా డెలివరీ సిబ్బందిని గౌరవించాలని, అతడి సమయస్ఫూర్తి అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ ఎగ్జిక్యూటివ్ పేరు, అతను పనిచేస్తున్న సంస్థ వివరాలు వెల్లడికాలేదు.
వంటగదిలో మంటలు.. మహిళకు అండగా నిలిచిన డెలివరీ ఎగ్జిక్యూటివ్.. వీడియో వైరల్
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri