POP BITES

Weekly Magazine

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులపర్తి గ్రామానికి చెందిన పాపారావు, అమ్మాజీ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Vol. 41 • Current Issue
Oct 05 – Oct 11, 2026

Contents

Featured Stories

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి 3
ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు తిలక్ వర్మ? 4
ఉగ్రవాదులకు నిధులిచ్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. రూ.55.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు 5
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో షాకింగ్ విషయం.. ఇంజిన్లు షట్‌డౌన్ చేసేందుకు కోపైలట్ యత్నం? 6
ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. 73 ఉద్యోగాలు, రూ.1,15,500 వరకు జీతం 7

ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి 8
అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి: రామ్మోహన్ నాయుడు 9

తెలంగాణ

ఉగ్రవాదులకు నిధులిచ్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. రూ.55.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు 10
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. రూ.1.20 కోట్ల విలువ 11

క్రీడలు

ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు తిలక్ వర్మ? 12
ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్ 13

ప్రపంచ వార్తలు

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో షాకింగ్ విషయం.. ఇంజిన్లు షట్‌డౌన్ చేసేందుకు కోపైలట్ యత్నం? 14

జాతీయ వార్తలు

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. 73 ఉద్యోగాలు, రూ.1,15,500 వరకు జీతం 15
ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 16
నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు 17

Weekly Statistics

This Week in Numbers 18

ఆంధ్రప్రదేశ్

2 stories this week

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులపర్తి గ్రామానికి చెందిన పాపారావు, అమ్మాజీ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి: రామ్మోహన్ నాయుడు

అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి: రామ్మోహన్ నాయుడు

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి స్వదేశీ దర్శనం 2.0 కింద కేంద్ర ప్రభుత్వం రూ.55.74 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన అధికారులు, అర్చకులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌ను రెండేళ్లలోపు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఆలయానికి దేశ, విదేశాల నుంచి భక్తుల రాక పెరుగుతోందని, ప్రతి ఆదివారం సుమారు 30 వేల మంది దర్శనానికి వస్తున్నారని తెలిపారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ

2 stories this week

ఉగ్రవాదులకు నిధులిచ్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. రూ.55.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఉగ్రవాదులకు నిధులిచ్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. రూ.55.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్‌లో 72 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల చేతిలో భారీగా మోసపోయాడు. ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు.. రూ.2 కోట్లు ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారంటూ బెదిరించారు. మనీలాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టారు. వీడియో కాల్‌లో సీనియర్ పోలీస్ అధికారినంటూ మరో వ్యక్తిని పరిచయం చేశారు. విషయం ఎవరికైనా చెబితే కుటుంబసభ్యులను కూడా కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. కేసు నుంచి బయటపడేందుకు డబ్బులు చెల్లించాలని బాధితుడు విడతల వారీగా రూ.55.20 లక్షలు చెల్లించాడు. మోసాన్ని గుర్తించిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. రూ.1.20 కోట్ల విలువ

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. రూ.1.20 కోట్ల విలువ

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద దాదాపు 800 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

క్రీడలు

2 stories this week

ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు తిలక్ వర్మ?

ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు తిలక్ వర్మ?

2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో నంబర్-3 స్థానాన్ని భర్తీ చేయగల సత్తా యువ బ్యాటర్ తిలక్ వర్మకు ఉందని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు. తిలక్ వర్మ ఏ స్థానంలోనైనా రాణించగలడని, నంబర్-3లో ఇప్పటికే సెంచరీ సాధించాడని జాఫర్ పేర్కొన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడి సగటు దాదాపు 55గా ఉందని, మూడు ఫార్మాట్లలోనూ అతడు రాణించగలడని తెలిపాడు.

ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్

ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్

ఆసియా క్రీడలు-2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించడంపై టీమిండియా హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించడం ప్రత్యేకమైన విజయమని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ భారత ఆటగాళ్లు సమష్టిగా అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. జట్టులో పలువురు ప్రపంచకప్ విజేతలు ఉన్నప్పటికీ, వారిలో చాలామందికి ఆసియాడ్ స్వర్ణం ఇదే తొలిసారి అని చెప్పాడు. పరిస్థితులు సవాల్‌గా ఉన్నప్పటికీ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన కనబరిచారని లక్ష్మణ్ తెలిపాడు.

ప్రపంచ వార్తలు

1 stories this week

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో షాకింగ్ విషయం.. ఇంజిన్లు షట్‌డౌన్ చేసేందుకు కోపైలట్ యత్నం?

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో షాకింగ్ విషయం.. ఇంజిన్లు షట్‌డౌన్ చేసేందుకు కోపైలట్ యత్నం?

ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన అనంతరం విమానం ఇంజిన్లను షట్‌డౌన్ చేసేందుకు ప్రయత్నించి ఉండవచ్చని ఇటలీ పత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొంది. దాడి తర్వాత విమానం ఒక్క నిమిషంలోనే 16 వేల అడుగుల మేర కిందకు దిగినట్లు తెలిపింది. ఇంజిన్లకు ఇంధన సరఫరాను నిలిపివేసే ప్రయత్నం కూడా జరిగి ఉండవచ్చని దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది.

జాతీయ వార్తలు

3 stories this week

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. 73 ఉద్యోగాలు, రూ.1,15,500 వరకు జీతం

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. 73 ఉద్యోగాలు, రూ.1,15,500 వరకు జీతం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో మొత్తం 73 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన డిగ్రీ అభ్యర్థులు అక్టోబర్ 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 29. ఎంపిక సింగిల్ లెవెల్ ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు జీతం లభిస్తుంది.

ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని క్రీడా ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీడీఏ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో 2.5 టన్నుల చెత్తను సేకరించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు గ్రీన్, బ్లూ చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటడం, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు

నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు

నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో పోలీసులు, ఇద్దరు అనుమానిత గ్యాంగ్ సభ్యుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ జసీమ్ గాయపడ్డారు. ఉస్మాన్‌పూర్‌లోని తమ ఇంటికి వెళ్లేందుకు వారు అటవీ ప్రాంతం గుండా వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడ మాటు వేశారు. పోలీసులు కనిపించగానే ఇద్దరూ కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరపడంతో కైఫ్, జసీమ్‌ల ఎడమ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం వారిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు.

This Week in Numbers

Weekly Statistics & Insights

10
Total Articles
10
Featured Stories
5
Categories Covered
7
Days of Coverage