పంజాబ్‌లో ఆప్ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి కాల్పులు
📅 30-08-2026
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత గుర్ప్రీత్ సింగ్ గోపి దారుణ హత్యకు గురయ్యారు. మిత్రుడు హర్‌ప్రీత్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుర్ప్రీత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన స్నేహితులపై కూడా కాల్పులు జరిగాయి. మమ్‌దోత్ టౌన్లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.