గ్రామీణ ఉపాధికి కొత్త దిశ.. నేడు వికసిత్ భారత్ గ్యారంటీ పథకం ప్రారంభం
📅 02-07-2026
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకాన్ని గురువారం ఏపీలో జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లెలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ పథకంతో గ్రామీణ ఉపాధి హామీ 100 రోజుల నుంచి 125 రోజులకు పెరగడంతో పాటు వారానికోసారి వేతన చెల్లింపులు, ఆలస్యమైతే పరిహారం, 15 రోజుల్లో పని కల్పించే హామీ వంటి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.